కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించినున్న పేపర్-2 ఎగ్జామినేషన్ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 23న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 11న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు. వాస్తవానికి డిసెంబరు 4న పరీక్ష నిర్వహించాలని మొదట భావించారు. కానీ డిసెంబరు 11న నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.


అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 11న డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. తుది కీతో పాటు ప్రశ్నపత్రాలను నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది. 


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి జులై 20న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 20 నుంచి ఆగస్టు 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 6న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా అక్టోబరు 1న రాతపరీక్ష నిర్వహించింది. ఆన్సర్ కీ విడుదల చేసి కీపై అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో కనీసం అర్హత మార్కులను జనరల్-30 %, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25 %, ఎస్సీ, ఎస్టీలకు 20 % గా నిర్ణయించింది. డిసెంబర్ 11న డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.


పేపర్-2 పరీక్ష విధానం..


పేపర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ట్రాన్స్‌లేషన్, ఎస్సే రైటింగ్ ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ట్రాన్స్‌లేషన్‌లో భాగంగా ప్యాసేజీ ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి ఒక ప్యాసెజ్, ఇంగ్లిష్ నుంచి హిందీలోని ఒక ప్యాసెజ్ ట్రాన్స్‌లేషన్ చేయాలి. అదేవిధంగా ఎస్సే కూడా హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌లేషన్ స్కిల్స్ పరీక్షించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.


Also Read:


డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...