SSC Combined Graduate Level Examination 2024 Schedule: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' టైర్-1 పరీక్ష తేదీని స్థాఫ్ సెలక్షన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 9 నుంచి 26 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధానంలో సీజీఎల్ టైర్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే విడుదల చేయనుంది. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్‌, ఫిజికల్/మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.

టైర్-1 పరీక్ష విధానం..మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు(గంట). 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 17,727

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

➥ అసిస్టెంట్

➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్

➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)

➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)

➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)

➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)

➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)

➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్

➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA)

➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

➥  అప్పర్ డివిజన్ క్లర్క్

➥ ట్యాక్స్ అసిస్టెంట్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...