భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 995 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేసినట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. వీరిలో జనరల్-344, ఈడబ్ల్యూఎస్-177, ఓబీసీ-262, ఎస్టీ-68, ఎస్సీ-144 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఫలితాలను ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది డిసెంబరు 14 నుంచి 16 వరకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 21న ఆన్సర్ కీని వెల్లడించగా.. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. 

Also Read: ఏపీ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, 'పార్ట్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఇదే!

సైంటిఫిక్ అసిస్టెంట్ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- @ ssc.nic.in

➥ అక్కడ హోంపేజీలో కనిపించే "Results'' బటన్‌‌పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ రిజల్ట్స్ పేజీలోని మెనుబార్‌లో ''Others'' బటన్‌‌పై క్లిక్ చేయాలి.

➥ అక్కడ కనిపించే 'SSC Scientific Assistant IMD Result 2023' ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా ఓపెన్ అవుతోంది.

➥ అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

సైంటిఫిక్ అసిస్టెంట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

కటాఫ్ మార్కుల వివరాలు ఇలా..

Also Read:

12,523 ఎంటీఎస్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12,523 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్‌టెక్నికల్), హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 17తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

1,151 పెరిగిన కానిస్టేబుల్ పోస్టులు, సవరణ నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు ఇలా!నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది. మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 152 పోస్టులు, అర్హతలివే!న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), ఒప్పంద/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా  లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 3లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...