'అగ్ని సాక్షి' సీరియల్, 'అర్ధనారీ', 'సుందరి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో పేరు తెచ్చుకున్న కథానాయకుడు అర్జున్ అంబటి (Arjun Ambati). ఆది సాయి కుమార్ 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో కాలేజీ స్టూడెంట్ రోల్ చేశారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'తెప్ప సముద్రం' (Theppa Samudram Movie). ఇందులో చైతన్య రావు (Chaitanya Rao) మరో కథానాయకుడు. యూట్యూబ్ సిరీస్ '30 వెడ్స్ 21'తో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. 


అర్జున్‌ అంబటి, చైతన్య రావు హీరోలుగా మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు సతీష్ రాపోలు 'తెప్ప సముద్రం' సినిమా తెరకెక్కిస్తున్నారు. 'బేబి' వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో 'కొరమీను' ఫేమ్‌ కిశోరి ధాత్రక్‌ కథానాయిక. 'బొమ్మాళి' రవిశంకర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం!  
మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. దాని మీద ఓ కొటేషన్ ఉంది. ''భగవద్గీత మహాభారతంలో ఓ భాగం కాదు, మహాభారతమే భగవద్గీతలో ఒక భాగం. భగవద్గీత ఒక మత గ్రంథం కాదు... మనిషి గ్రంథం'' అని పేర్కొన్నారు. ఈ లైన్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేశాయి.


టైటిల్ పోస్టర్ చూస్తే... న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సినిమా రూపొందిస్తున్నట్లు అర్థం అవుతోంది.  అందులో టేబుల్‌ వెనుక చొక్కా మీద కాకీ చొక్కా వేసుకుని ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. అతని రెండు చేతులు టేబుల్ మీద ఉన్నాయి. అయితే... ఓ చేతి కింద భగవద్గీత ఉంది. మరో చేతిపై కత్తితో పొడిచినట్టు ఉంది. టేబుల్‌ ముందు భాగంలో ధర్మానికి ప్రతీకైన జాతీయ చిహ్నం ఒక వైపు, మరో వైపు శాంతికి చిహ్నమైన పావురం ఉన్నాయి. వ్యక్తి వెనుక లా బుక్స్‌ కనబడుతున్నాయి.


త్వరలో మంగ్లీ పాడిన మాస్‌ బీట్‌ విడుదల
సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. త్వరలో సింగర్‌ మంగ్లీ పాడిన మాస్‌ బీట్‌ సాంగ్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 


Also Read 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే? 


అర్జున్ అంబటి, చైతన్య రావు... ఇద్దరూ మంచి నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో వాళ్ళ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని, హార్డ్ హిట్టింగ్ కథాంశంతో తీస్తున్న సినిమా ఇదని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలో వాళ్ళ ఫస్ట్ లుక్స్ విడుదల చేయనున్నారని సమాచారం. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. 


ఈ చిత్రానికి కూర్పు : ఎస్‌.బి. రాజు తలారి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : పున్న శ్రీనివాస్‌, స్టంట్స్‌: శంకర్‌ ఉయ్యాల, కొరియోగ్రఫీ: రామ్‌ మాస్టర్‌, పాటలు : పెంచల్‌దాస్‌, బాలాజీ, పూర్ణాచారి, ఛాయాగ్రహణం : శేఖర్‌ పోచంపల్లి, సంగీతం : పీఆర్‌, నిర్మాత : నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌, కథ - కథనం - దర్శకత్వం : సతీష్‌ రాపోలు.


Also Read 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?