SSC CAPF SI Posts: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్(CAPF) విభాగాల్లో సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌  నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ 2024-25 క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 15న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్‌లో రాత పరీక్ష ఉంటుంది. గత సంవత్సరం 1,876 ఖాళీలు భర్తీ అయ్యాయి. సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400-రూ.1,12,400 వేతనం చెల్లిస్తారు.


వివరాలు..


* సబ్ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024 


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తుఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్-సర్వీసెమెన్/దివ్యాంగ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


వేతనం: నెలకు రూ.35,400-రూ.1,12,400. 


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 15.02.2024.


➥ దరఖాస్తుకు చివరితేదీ: 14.03.2024.


➥ రాతపరీక్ష: మే లేదా జూన్‌. 


Website


ALSO READ:


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2024 నోటిఫికేషన్ విడుదల
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5  వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC IFS 2024: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వెల్లడి
ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2024 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 14న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..