Civil Services (Preliminary) Examination 2024: సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గతేడాది 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. ఈ ఏడాది 1056 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.
పోస్టుల వివరాలు..
* యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) ఎగ్జామ్ - 2024
పోస్టుల సంఖ్య: 1056
సర్వీసులు:
➨ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
➨ ఇండియన్ ఫారిన్ సర్వీస్
➨ ఇండియన్ పోలీస్ సర్వీస్
గ్రూప్-ఎ:
➨ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్
➨ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్
➨ ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్
➨ ఇండియన్ పోస్టల్ సర్వీస్
➨ ఇండియన్ పీ&టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్
➨ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్)
➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్)
➨ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రేడ్-3)
➨ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్
గ్రూప్-బి:
➨ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి(సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ సివిల్ సర్వీస్,
➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్
➨ పాండిచ్చేరి సివిల్ సర్వీస్
➨ పాండిచ్చేరి పోలీస్ సర్వీస్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షల సమయానికి మాత్రం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 21 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1991 - 01.08.2002 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం..
➥ ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
➥ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.03.2024. (6 PM)
➥ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 26.05.2024.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 80 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 25 నగరాల్లోని కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్, విజయవాడలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు.
ALSO READ:
UPSC IFS 2024: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వెల్లడి
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 14న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..