కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2021 స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 19న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్-2 ఫలితాలను గతేడాది డిసెంబరు 16న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


మొత్తం 35,023 మంది అభ్యర్థులు టైపింగ్ టెస్టుకు; 4374 మంది అభ్యర్థులకు కాగ్‌లో డీఈవో పోస్టులకు 'డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌'కు ఎంపికయ్యారు. ఇక 1511 మంది అభ్యర్థులు ఇతర విభాగాల్లో డీఈవో పోస్టులకు సంబంధించి 'డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌'కు ఎంపికయ్యారు. టైర్-2 పరీక్షలకు హాజరైనవారిలో 14,873 మంది అభ్యర్థులు టైపింగ్ టెస్ట్‌కు, 220 మంది అభ్యర్థులు కాగ్‌లో డీఈవో పోస్టులకు, ఇతర విభాగాల్లో డీఈవో పోస్టులకు   1067 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


SSC CHSL Result 2021 List-1LDC/JSA & PA/SA 


SSC CHSL Result 2021 List-2DEO IN CAG


SSC CHSL Result 2021 List-3:  DEO OTHER THAN CAG


మొత్తం ఖాళీలు 6072.. 
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2021 ద్వారా మొత్తం 6,072 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీచేయనుంది. వీటిలో జనరల్-2924, ఓబీసీ-1049, ఎస్సీ-990, ఎస్టీ-469, ఈడబ్ల్యూఎస్-640 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎక్స్-సర్వీస్‌మెన్-577, దివ్యాంగులకు-36, OH-58, HH-64, VH-58 పోస్టులు కేటాయించారు. 


గతేడాది మే 24 నుంచి జూన్ 10 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ -2021' టైర్-1 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 54,092 మంది టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 18న 'టైర్-2 (డిస్క్రిప్టివ్)' పరీక్ష నిర్వహించారు. టైర్-2 ఫలితాలను గతేడాది డిసెంబరు 16న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


టైర్-2 ఫలితాల్లో మొత్తం 40,908 మంది అభ్యర్థులు టైర్-3లో స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది. టైర్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలకు కేటాయిస్తారు. ఈ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 


Also Read:


ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ 2021 తుది ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్ఈ)-2021 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నాలుగు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. మొదటి జాబితాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 524 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 110 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక మూడో జాబితాలో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 648 మంది అభ్యర్థులు, నాలుగో జాబితాలో మిగతా పోస్టులకు 6249 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మొత్తం 7621 పోస్టులకుగాను 7541 మంది అభ్యర్థులను  ఎస్‌ఎస్‌సీ ఎంపికచేసింది. వివిధ కారణాల వల్ల 25 మంది అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.
ఫలితాలు, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...