SSC CHSL 2024 TIER-1 SCHEDULE: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL)-2024' టైర్-1 పరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఖరారుచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 11 వరకు టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ 3 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల తదితర కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను విడుదల చేయనున్నారు.


కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి 'CHSL-2024' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 3712 లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  టైర్‌-1, టైర్‌-2 రాతపరీక్షలతోపాటు అవసరమైన పోస్టులకు కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.


టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.


టైర్-2 పరీక్ష విధానం..


స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..


✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.


✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.


✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.


జీతాభత్యాలు..


➥ ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200 ఇస్తారు.


➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100 (పే లెవల్-4), రూ.29,200-92,300 (పే లెవల్-4) ఇస్తారు. 


➥  డేటాఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఎ)కు పోస్టులకు రూ.29,200-92,300 ఇస్తారు.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...