న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), ఒప్పంద/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా  లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 3లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


1. హై-పెర్ఫార్మెన్స్ కోచ్: 25 పోస్టులు    


2. చీఫ్ కోచ్: 49 పోస్టులు    


3. సీనియర్ కోచ్: 34 పోస్టులు    


4. కోచ్: 44 పోస్టులు    


విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టి టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, కబడ్డీ, కయాకింగ్ కెనోయింగ్, ఖో-ఖో, తైక్వాండో, వాలీబాల్, వుషు.    


అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా తత్సమానం. లేదా ఒలింపిక్స్/ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత లేదా పారాలింపిక్స్/ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయి ఉండాలి.  


వయోపరిమితి: అర్హత, అనుభవం ఆధారంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: శాయ్ నిబంధనల మేరకు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2023.


Notification 
Application 
Website  


Also Read:


SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక  హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌: మంత్రి హరీశ్‌ రావు
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తామన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌, త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ! - మంత్రి సబితా
తెలంగాణలో మరో ఉద్యోగాల జాతరకు త్వరలోనే సైరన్ మోగనుంది. రాష్ట్రంలో త్వరలోనే 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రకటించారు. మన ఊరు-మన బడి మొదటిదశ కింద మరమ్మతులు చేపట్టిన 9,123 పాఠశాలలు జూన్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...