సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీచేయనుంది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్ 30లోగా ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
జూనియర్ టెక్నికల్ అసోసియేట్(వర్క్స్/ డ్రాయింగ్): 35 పోస్టులు
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్.
అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఐటీ/ సీఎస్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Secretary to Principal Chief Personnel Officer & Senior Personnel Officer (Engineering),
office of Principal Chief Personnel Officer,
4th Floor, Personnel Department, Rail Nilayam,
South Central Railway,
Secunderabad - 500025.
ముఖ్యమైన తేదీలు...
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2023
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 30.06.2023.
Also Read:
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో జూన్ 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రైట్స్ లిమిటెడ్‌లో 20 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..