Singareni Jobs 2022 Notification: తెలంగాణలో ప్రతిష్టాత్మక సంస్థల్లో సింగరేణి ఒకటి. అటువంటి సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అసలే ఉద్యోగాల కోసం రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా రానున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిటిటెడ్ (SCCL Recruitment 2022) నోటిఫికేషన్‌లో భాగంగా 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 39 మంది మైనింగ్ ఇంజనీర్ ఖాళీలు, 10 మంది ఇండస్ట్రియల్ ఇంజనీర్లు, 6 ఐటీ ఇంజనీర్లు, మరికొన్ని విభాగాలలో పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదివరకే 58 పర్యాయాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లలో 3,498 పోస్టుల భర్తీ జరిగింది. వీటితో పాటు మరో 12,553 ఖాళీలను గత ఏడేళ్లలో భర్తీ చేశారు. ఓవరాల్‌గా 16,040 పోస్టులను భర్తీ చేసినట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


సింగరేణి లేటెస్ట్ జాబ్స్ వివరాలు..
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు - 177 
మైనింగ్ ఇంజనీర్ పోస్టులు - 39
ఇండస్ట్రియల్ ఇంజనీర్లు - 10
ఐటీ ఇంజనీర్లు - 6


ఇంటర్వ్యూ తొలగించిన సంస్థ..
గతంలో ఉద్యోగాలలో అవకతవకలు జరగడంతో కేవలం పరీక్ష ద్వారానే అర్హులైన వారిని నియమించాలని సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూసేందుకు ఇంటర్వ్యూ ప్రక్రియను తొలగించి, కేవలం పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. కారుణ్య నియామకాలకు సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలకు అర్హులైన వారిని తప్పకుండా తీసుకుంటామని, వారికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు.


సింగరేణిలో గతేడాది జూనియర్ సర్వే ఇంజనీర్ ఈ1 గ్రేడ్, వెల్డర్ ట్రెయినీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ కేటగిరీ 1, జూనియర్ స్టాఫ్ నర్స్, గ్రేడ్ డి ఖాళీ పోస్టులను భర్తీ చేశారు. మరిన్ని ఖాళీలు ఉన్నాయని వేలాది పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.


Also Read: CISF Recruitment 2022: ఇంటర్‌ క్వాలిఫికేషన్‌తో CISFలో ఉద్యోగం.. సుమారు డెబ్భైవేల జీతం...


Also Read: RRB NTPC Exam Suspended: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తాత్కాలికంగా రద్దు.. బోర్డు కీలక ప్రకటన