1,149 కానిస్టేబుల్(ఫైర్) ఉద్యోగాల భర్తీ కోసం పురుష అభ్యర్థుల నుంచి CISF దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇవాల్టి(29th)నుంచి ప్రారంభమవుతోంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
పోస్టు పేరు: కానిస్టేబుల్(ఫైర్)
ఖాళీల వివరాలు : 1,149
జనరల్ కేటగిరి: 489 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్ : 113 ఉద్యోగాలు
ఓబీసీ: 249 ఉద్యోగాలు
ఎస్సీ: 161 ఉద్యోగాలు
ఎస్టీ: 137ఉద్యోగాలు
రాష్ట్రాలవారిగా ఈ ఉద్యోగాలను విభజించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 109 మందిని తీసుకోనున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 79, తెలంగాణ నుంచి ౩౦ మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో బిహార్ నుంచి 123 మందిని తీసుకోనున్నారు.
జీతం: పే లెవల్-౩(రూ. 21,700 నుంచి రూ. 69,100)
విద్యార్హతలు: సైన్స్ గ్రూప్‌లో ఇంటర్ పాస్ అయిన వాళ్లంతా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
ఫిజికల్ డిటేల్స్:
ఎత్తు: 165CMS
చాతీ: 77-82CMS
బరువు: ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక విధానం: PET/PST, రాత పరీక్ష/CBT/DV/DME/RME
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29-జనవరి-2022
రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్: 04-మార్చ్-2022
ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్: 07-మార్చ్-2022
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
ఫీజులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.
పదెనిమిదేళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వారంతా ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2