ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు...
* సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1422 (రెగ్యులర్ పోస్టులు-1400, బ్యాక్‌లాగ్ పోస్టులు-22).
సర్కిళ్లవారీగా ఖాళీలు: భోపాల్-183, భువనేశ్వర్-176, హైదరాబాద్-176, జైపుర్-201, కోల్‌కతా-175, మహారాష్ట్ర-212, నార్త్ ఈస్టర్న్-300.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30.09.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతభత్యాలు: రూ.36,000-రూ.63840.
పరీక్ష విధానం:
✪ మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు.
✪ అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, ఎస్సే) ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.
✪ ఇక ఇంటర్యూకు 50 మార్కులు కేటాయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు.
ముఖ్యమైన తేదీలు..
✪ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.10.2022.
✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.11.2022.
✪ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: నవంబర్/ డిసెంబర్ 2022.
✪ ఆన్‌లైన్ పరీక్ష తేది: 04.12.2022.
::Also Read::
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు షురూ! ఇలా అప్లయ్ చేసుకోండి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 20 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలు!
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..