SBI Apprentice Exam Admit Cards: ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌కార్డును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కాల్‌లెటర్ల(Call Letters)ను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబరు 7 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 7న పలు కేంద్రాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- sbi.co.in/web/careers
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Current Openings at SBI' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత "Engagement of Apprentices Under The Apprentice Act, 1961 (Advt. No. CRPD/APPR/2023-24/17'' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 5: క్లిక్ చేయగానే లాగిన్ వివారాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రూల్ నెంబరు, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
Step 6: వివరాలు నమోదుచేయగానే అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.
Step 7: అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.
Direct Link: అప్రెంటిస్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సెప్టెంబరు 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనన్నారు. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు డిసెంబరు 7న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు.
పరీక్ష విధానం:
➥ మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-25 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. ఒక్కో విభాగానికి 15 నిమిషాల సమయం కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు.
➥ ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లిష్ మినహాయించి మిగతా ప్రశ్నలన్నీ దేశంలోని 13 స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. ఇందులో అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు:
➥ ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
➥ తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.