కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమా‌బల్‌ తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్‌కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో అభ్యర్థులు పాల్గొని ఉండాలి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.



పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్-గెజిటెడ్

పోస్టుల సంఖ్య: 399 పోస్టులు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడాంశాలకు సంబంధించి ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపక్ తక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్‌, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, యాచింగ్.

వయసు: 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, ఫీజుకు సంబంధించిన పోస్టల్ ఆర్డర్ లేదా డిడి జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. చిరునామా వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.

ఎంపిక ప్రక్రియ: స్పోర్ట్స్ మెరిట్, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


జీత భత్యాలు: రూ.21,700 - రూ.69,100.

దరఖాస్తుకు చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


 


Notification & Application


Website


 


 


:: Also Read ::


BPCL: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు, వీరికి అవకాశం!
కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



CIL Recruitment: కోల్‌ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!

కోల్ ఇండియాలో భాగంగా ఉన్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/బీడీఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


NABARD Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...