ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కూతురు శనివారం మరణించింది. ఈ విషయాన్ని డేవిడ్ మిల్లర్ తన ఇన్‌స్టాగ్రాం పోస్టు ద్వారా ప్రకటించాడు. క్యాన్సర్ కారణంగా తను మరణించిందని తెలుస్తోంది.
‘RIP you little rockstar💗. Love you always!💗’ అని ఆ పోస్టు కింద క్యాప్షన్‌లో తెలిపాడు. ఈ పోస్టు కింద ఫ్యాన్స్, తోటి క్రికెటర్ల కూడా డేవిడ్ మిల్లర్ కూతురి మరణంపై సంతాపం తెలుపుతున్నారు. తన కూతురి ఫోటోల్లో కొన్నిటిని కలిపి ఇన్‌స్టాలో రీల్ తరహాలో పోస్ట్ చేశాడు. డేవిడ్ మిల్లర్‌కు మనదేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో 38 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు కూడా డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది.
ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా మిల్లర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గువాహటిలో జరిగిన రెండో టీ20లో డేవిడ్ మిల్లర్ కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. మొదటి వన్డేలో కూడా దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడానికి డేవిడ్ మిల్లర్ ఆడిన ఇన్నింగ్సే కారణం.