RRB Technician Grade 1 and Grade 3 Jobs Notification : రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ నోటిఫికేషన్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల పట్ల ఆసక్తి ఉన్నవారు.. జాబ్స్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే కావాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు రుసుము, విద్య, శాలరీ, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. 

పోస్టులు 

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్ కోసం) 180 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోసం 6,000 చొప్పున మొత్తం 6,180 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టులు - 6,180

కావాల్సిన అర్హతలు 

ఆర్​ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకునేవారు బీటెక్ లేదా డిప్లోమో చేసి ఉండాలి. లేదా బీఎస్సీలో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ కాంబినేషన్ చేసి ఉండాలి.  ఆర్​ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేయాలనుకుంటే పది అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.

జీతం

గ్రేడ్ 1 పోస్ట్ జీతం నెలకి 29,200. గ్రేడ్ 3 వారికి 19,900 జీతం వస్తుంది.  

వయసు

గ్రేడ్ 1కి అప్లై చేయాలనుకునేవారు 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. గ్రేడ్ 3కి అప్లై చేసేవారు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల పెంపు ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు పెంపు ఉంటుంది.  

ఎంపిక విధానం

ఆర్​ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 పోస్ట్​ల ఎంపిక కోసం ఆన్​లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దానిలో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు

ఆర్​ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే జూన్ 28, 2025 నుంచి అప్లై చేయవచ్చు. అలాగే 28 జులై వరకు సమయం ఉంటుంది. 

ఫీజులు

ఎస్సీ, ఎస్టీలు 250 కడితే సరిపోతుంది. మిగిలిన వారు 500 అప్లికేషన్ రుసుము చెల్లించాలి. 

గ్రేడ్ 1 ఎగ్జామ్ సిలబస్

ఆన్​లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో General Awareness 10 మార్కులు, General Intelligence and Reasoning 15 మార్కులు, బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్​పై 20 మార్కులు, లెక్కలు 20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 35 మార్కులు ఇలా 100 మార్కులకు టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం కోసం అప్లై చేసేవారు సంబంధిత సిలబస్​పై గ్రిప్ పెంచుకోవాలి. 

గ్రేడ్ 3 ఎగ్జామ్ సిలబస్

లెక్కలు 25 మార్కులు, General Intelligence and Reasoning 25 మార్కులు, General Science 40 మార్కులు, General Awareness 10 మార్కులు ఉంటాయి.  

గ్రేడ్ 1, గ్రేడ్ 3 కి అప్లై చేయాలనుకునేవారు ఆయా సిలబస్ ఫాలో అవ్వాలి. కటాఫ్ కూాడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది.