Iran Hormuz Closure: భారత్ ఇంధన సరఫరా స్థిరంగా, సరిపడా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి పౌరులకు హామీ ఇచ్చారు. కీలకమైన ప్రపంచ చమురు షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే చర్యను ప్రకటించిన తర్వాత పూరి ఈ ప్రకటన చేశారు.
గత రెండు వారాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని నిశితంగా భారత్ గమనిస్తోంది. ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. X లో పెట్టిన ఒక పోస్ట్‌లో పూరి తెలిపారు.
"గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాలను వైవిధ్యపరిచాం. సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హార్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదు" అని పూరి X లో రాశారు.
"చమురు మార్కెటింగ్ కంపెనీలకు వారాలకు సరిపడా సరఫరాలు ఉన్నాయి. అనేక మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అవుతోంది. మా పౌరులకు ఇంధన కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాము" అని ఆయన అన్నారు.
ఆదివారం అణు స్థావరాలు - ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా వైమానిక దాడుల తర్వాత హార్మూజ్ జలసంధి మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. హార్మూజ్ జలసంధి, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురుకు ముఖ్యమైన రవాణా మార్గం. భారతదేశం మొత్తం దిగుమతి చేసుకునే 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల (bpd) ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. అయితే, భారత్ భిన్నమైన వనరులు కలిగి ఉంది. రష్యన్ చమురు హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా సూయజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ లేదా పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తోంది. అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ ప్రవాహాలు కూడా బ్యాకప్ ఆప్షన్‌లుగా ఉన్నాయి. చమురు సంస్థలు సరిపడా సరఫరా కలిగి ఉంటూనే ఇంధన సరఫరాను పొందుతున్నాయి.
జలసంధి మూసివేయడం వల్ల ప్రపంచంలోని చమురులో 20–25%, ప్రపంచ LNG వాణిజ్యంలో 30% ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వలన చమురు ధరలు బ్యారెల్‌కు $200–$300 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోది ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో 45 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవలి ఉద్రిక్తతలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.