Railway Jobs: రైల్వేశాఖలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

RRB: ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Continues below advertisement

RRB NON TECHNICAL POPULAR CATEGORIES (NTPC) GRADUATE POSTS: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

Continues below advertisement

వివరాలు..

* ఎన్టీపీసీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 8113

పోస్ట్ పేరు 7వ CPC ప్రకారం చెల్లింపు స్థాయి ప్రారంభ వేతనం (రూ.) వైద్య ప్రమాణం 01.01.2025 నాటికి వయసు మొత్తం ఖాళీలు
(అన్ని RRBలు)
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 6 35400 B2 18-36 1736
స్టేషన్ మాస్టర్ 6 35400 A2 18-36 994
గూడ్స్ రైలు మేనేజర్ 5 29200 A2 18-36 3144
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 1507
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5 29200 C2 18-36 732
మొత్తం ఖాళీలు - - - - 8113

రైల్వే జోన్లవారీగా ఖాళీలు..

  • సికింద్రాబాద్: 478 
  • అహ్మదాబాద్: 516 
  • అజ్మేర్: 132 
  • బెంగళూరు: 496 
  • భోపాల్: 155 
  • భువనేశ్వర్: 758 
  • బిలాస్‌పూర్: 649 
  • ఛండీగఢ్: 410 
  • చెన్నై: 436 
  • గోరఖ్‌పూర్: 129 
  • గువాహటి: 516 
  • జమ్మూ, శ్రీనగర్: 145 
  • కోల్‌కతా: 1382 
  • మాల్దా: 198 
  • ముంబయి: 827 
  • ముజఫర్‌పూర్: 12 
  • ప్రయాగ్‌రాజ్: 227 
  • పాట్నా: 111 
  • రాంచీ: 322 
  • సిలిగురి: 40 
  • తిరువనంతపురం: 174 

ALSO READ: సింగరేణిలో మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు 1.25 లక్షల జీతం

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కాగా.. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. 

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ(NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటిగిరీలవారీగా జనరల్/ఈడబ్ల్యూఎస్ 3 సంవత్సరాలు, ఓబీసీ-6, ఎస్సీ/ఎస్టీ 8 సంవత్సరాలు; దివ్యాంగులు 10-15 సంవత్సరాలు;  ఇతరులకు రైల్వే నిబంధనల మేరకు వయోసడలింపులు ఉంటాయి.

పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్టేజ్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇక దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తారు. వీరికి పరీక్ష సమయంలో మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తారు.   

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

స్టేజ్-1 (సీబీటీ) పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు 'స్టేజ్-1' కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించారు. ఇక పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలుచేస్తారు. ప్రతి తప్పు సమాధానానిక 1/3 వంతున మార్కుల్లో కోత విధిస్తారు.

స్టేజ్-2 (సీబీటీ) పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు 'స్టేజ్-2' కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, మ్యాథమెటిక్స్-35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించారు. ఇక పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలుచేస్తారు. ప్రతి తప్పు సమాధానానిక 1/3 వంతున మార్కుల్లో కోత విధిస్తారు.

స్కిల్ టెస్ట్:
➥ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఖాళీలకు అనుగుణంగా 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను టైపింగ్ టెస్టుకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు కంప్యూటర్‌లో నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. 

➥ స్టేషన్ మాస్టర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు.

ALSO READ: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ విడుదల: 13.09.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.09.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.10.2024  (23.59 hrs.)

➥ ఫీజు చెల్లింపు తేదీలు: 14.10.2024 - 15.10.2024. (23.59 hrs.)

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 16.10.2024 - 25.10.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola