RRB NTPC Exam : NTPC గ్రాడ్యుయేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2025కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను రైల్‌వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వీటిని అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్ లింక్ రీజియన్ వారీగా RRB వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం NTPC పరీక్ష జూన్ 29 నుంచి జులై 21 వరకు జరుగుతుంది. జూన్ 25 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. 

సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? RRB NTPC సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025ని ఈ కింది స్టెప్స్‌ ను అనుసరించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు వారి సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌ల నుంచి RRB NTPC 2025 సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

ముందుగా మీ RRB ప్రాంతం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.  

హోమ్‌పేజీలో CEN నంబర్ 05/2024 కోసం నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

అభ్యర్థి పోర్టల్‌లోకి వెళ్లాలి.  

RRB NTPC పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి. 

లాగిన్ విండోలో మీ యూజర్ ID, పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి.  

సిటీ సమాచార స్లిప్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. 

భవిష్యత్ ఉపయోగం కోసం దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్‌ తీసుకోండి. 

సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో ఏం వివరాలు ఉన్నాయి!RRB NTPC 2025 నగర స్లిప్‌లో ఈ సమాచారం ఉంటుంది:

అభ్యర్థి పేరు రోల్ నంబర్ కనిపిస్తుంది. 

ఫోటోగ్రాఫ్ ఉంటుంది. 

పరీక్ష సిటీ, కేంద్రం వివరాలు

షెడ్యూల్ చేసిన పరీక్ష తేదీ

పరీక్ష సమయం

పరీక్ష రోజు కోసం ముఖ్యమైన సూచనలు అన్నీ ఇందులో ఉంటాయి. 

పరీక్ష ఎలా ఉంటుంది?RRB NTPC నియామకం మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష (CBT 1 ), మెయిన్స్ పరీక్ష (CBT 2 ),  ఉద్యోగాన్ని బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్-బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఉంటుంది. 

RRB NTPCలో CBT 1, CBT 2 సిలబస్‌లో సబ్జెక్టులు: గణితం, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. CBT 1లో 100 మార్కులకు 100 ప్రశ్నలు, CBT 2లో 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 90 నిమిషాలు సమయం కేటాయిస్తారు. ప్రతి తప్పుడు  సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు.