RRB Recruitment Exams 2024 Schedule: దేశంలోని వివిధ రైల్వేజోన్ల పరిధిలో 41,500 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ షెడ్యూలులో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, టెక్నీషియన్, జేఈ రాత పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల కొత్త షెడ్యూలును రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. నవంబరు 25 నుంచి డిసెంబరు 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నవంబరు 25 నుంచి 29 మధ్య అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు, డిసెంబరు 2 నుంచి 12 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్ఐ పోస్టులకు, డిసెంబరు 13 నుంచి 17 వరకు జూనియర్ ఇంజినీర్, ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక డిసెంబరు 18 నుంచి 29 మధ్య టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 


రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, పరీక్షల తేదీ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.


దేశంలోని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను ఈ పరీక్షల ద్వారా భర్తీచేయనున్నారు. ఇందులో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ పోస్టులు; 14,298 టెక్నీషియన్‌ పోస్టులు; 7,951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు ఇప్పటికే ముగియగా.. టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


రైల్వే రాతపరీక్షల షెడ్యూలు...


➥ అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1): 25.11.2024 నుంచి 29.11.2024 వరకు.


➥ ఆర్‌పీఎఫ్‌ ఎస్ఐ: 02.12.2024 నుంచి 12.12.2024 వరకు.


➥ టెక్నీషియన్: 18.12.2024 నుంచి 29.12.2024 వరకు.


➥ జూనియర్ ఇంజినీర్, ఇతర పోస్టులకు: 13.12.2024 నుంచి 17.12.2024 వరకు.


ఈ పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబరులోనే నిర్వహించనున్నారు. పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. పరీక్షకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్; 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై; 14298 టెక్నీషియన్‌; 7951 జూనియర్‌ ఇంజినీర్‌.. మొత్తంగా 41,500 ఖాళీల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఆయా పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 



ALSO READ: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...