దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి (లెవెల్‌-1, నోటిఫికేషన్ నం. ఆర్‌ఆర్‌సీ 01/2019) ఉద్యోగ నియామకాలు పూర్తయిన నేపథ్యంలో ఆర్‌ఆర్‌సీ- సికింద్రాబాద్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. పరీక్ష దరఖాస్తు ఫీజును అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు తిరిగి చెల్లించినున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) వెల్లడించింది. గతేడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ)కు హాజరైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.


అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 14 నుంచి 30న సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతా నంబర్‌, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ తదితర వివరాలను తాజాగా నమోదు చేయాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.250 రీఫండ్‌ కానుంది.


Refund Link



Also Read:


ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 4 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..