RPF Recruitment: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి RPF 1/2024, RPF 2/2024 నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్-452, కానిస్టేబుల్- 4208 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10వతరగతి లేదా తత్సమానం, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఏప్రిల్ 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన ముగుస్తుంది. కంప్యూటర్ ఆధారాత పరీక్ష(సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), రూల్ ఆఫ్ రిసర్వేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 4660 పోస్టులు
⏩ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 452
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.35,400.
⏩ కానిస్టేబుల్ పోస్టులు: 4208
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వతరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.21,700.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈబీసీ) అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారాత పరీక్ష(సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), రూల్ ఆఫ్ రిసర్వేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.04.2024
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 14.05.2024
ALSO READ:
రైల్ వీల్ ఫ్యాక్టరీలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
Act Apprentice Recruitment: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2023-24 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 192 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 100 ఇంజినీర్ ట్రైయినీ పోస్టులు, వివరాలు ఇలా
THDCIL Recruitment: తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (THDC) ఇంజినీర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్-2023 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.