RITES Limited: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి

RITES Limited: రైట్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరతుంది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపిక చేస్తారు.

Continues below advertisement

RITES Recruitment of Engineering Professionals: గురుగ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 02 దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, డాక్యుమెంట్ పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 11 పోస్టులు

⏩ మేనేజర్/సివిల్ (ట్రాన్స్‌పోర్ట్ ప్లానర్/ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీర్): 02 పోస్టులు

అర్హత: ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్‌), ఫుల్ టైమ్ బీఆర్క్‌- ఆర్కిటెక్చర్ (5 సంవత్సరాలు), ఫుల్ టైమ్ బి ప్లానింగ్ (4 సంవత్సరాలు) అండ్ మాస్టర్స్ డిగ్రీ (ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ / ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ లేదా తత్సమానం / సినానిమస్ / సిమిలర్ క్వాలిఫికేషన్)తో పాటు 05 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ మేనేజర్ / సివిల్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానర్): 01 పోస్టు

అర్హత:ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్‌), ఫుల్ టైమ్ బీఆర్క్‌- ఆర్కిటెక్చర్ (5 సంవత్సరాలు) అండ్ మాస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ / అర్బన్ / రీజినల్ ప్లానింగ్‌తో పాటు పాటు 05 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.   

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ మేనేజర్ / సివిల్ (అర్బన్ డిజైనర్): 01 పోస్టు

అర్హత:ఫుల్ టైమ్ బీఆర్క్‌- ఆర్కిటెక్చర్ (5 సంవత్సరాలు) అండ్ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (అర్బన్ డిజైన్)తో పాటు 05 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ జాయింట్ జనరల్ మేనేజర్ / సివిల్ (జియో-ఫిజిసిస్ట్): 01 పోస్టు

అర్హత: జియోఫిజిక్స్‌లో మాస్టర్‌తో పాటు 13 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి

వయోపరిమితి: 43 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ సీనియర్ మేనేజర్ /మెకానికల్ (వెంటిలేషన్ ఎక్స్‌పర్ట్): 01 పోస్టు

అర్హత: ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(మెకానికల్ ఇంజినీరింగ్‌), ఎంటెక్(ఏరోడైనమిక్స్ లేదా థర్మల్ ఇంజనీరింగ్ లేదా ఫ్లూయిడ్ మెకానిక్స్) ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 08 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ సీనియర్ మేనేజర్ / ES&T(E&M ఎక్స్‌పర్ట్): 01 పోస్టు

అర్హత: ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌), ఎం.టెక్(ఇండస్ట్రియల్ పవర్ అండ్ ఆటోమేషన్ లేదా కంట్రోల్ అండ్ ఆటోమేషన్ లేదా పవర్ సిస్టమ్) ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 08 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

⏩ అసిస్టెంట్ మేనేజర్ / సివిల్ (బ్రిడ్జి ఇంజినీర్): 04 పోస్టులు

అర్హత: ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్‌)తో పాటు 02 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వేతనం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులకు రూ.40,000 - రూ. 1,40,000; మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.1,60,000; జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌: రూ.80,000-రూ.1,80,000; సీనియర్‌ మేనేజర్‌ రూ.60,000-రూ.1,80,000.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 02.02.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola