గురుగ్రామ్‌లోని  రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (రైట్స్) లిమిటెడ్ ఇంజినీర్‌(సివిల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.  


వివరాలు.. 


* సివిల్ ఇంజినీర్‌ 


మొత్తం ఖాళీలు: 30


అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 01.05.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్/ఎస్సీ /ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300గా నిర్ణయించారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు:  ఏడాదికి రూ.13.76 లక్షలు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.05.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 25.06.2023.


Notification


Online Application


Website


 


Also Read:     


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


రైట్స్‌ లిమిటెడ్‌లో 20 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు
గురుగావ్‌‌లోని రైట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో జూన్ 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..