గుర్గావ్‌లోని రైట్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను చేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 36.
1. టీమ్ లీడర్(ప్రాజెక్ట్ కంట్రోల్): 01
2. టీమ్ లీడర్ (ఎంఈపీ): 03
3. టీమ్ లీడర్ (సేఫ్టీ): 01
4. ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్): 01
5. ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎంఈపీ): 04
6. ప్రాజెక్ట్ ఇంజినీర్ (వాటర్ సప్లై): 01
7. ప్రాజెక్ట్ ఇంజినీర్ (షోర్ ప్రొటెక్షన్): 02
8. క్యూఏ/ క్యూసీ ఇంజినీర్లు: 04
9. సేఫ్టీ ఇంజినీర్: 04
10. రెసిడెంట్ ఇంజినీర్ (బిల్డింగ్): 02
11. రెసిడెంట్ ఇంజినీర్ (రోడ్): 01
12. రెసిడెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01
13. రెసిడెంట్ ఇంజినీర్ (వాటర్ సప్లై): 01
14. క్వాలిటీ ఇంజినీర్ (బిల్డింగ్): 02
15. క్వాలిటీ ఇంజినీర్ (రోడ్): 03
16. క్వాలిటీ ఇంజినీర్ (వాటర్ సప్లై): 03
17. క్వాలిటీ ఇంజినీర్ (బ్రిడ్జ్): 02
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2023 నాటికి టీమ్ లీడర్(ప్రాజెక్ట్ కంట్రోల్), టీమ్ లీడర్(ఎంఈపీ), టీమ్ లీడర్ (సేఫ్టీ) పోస్టులకి 50 సంవత్సరాలు, మిగతా పోస్టులకి 40 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు ఫీజు: జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 02.07.2023.
* వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభం: 11.07.2023.
Also Read:
నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో 73 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
చండీగఢ్ పీజీఐఎంఈఆర్‌లో 206 గ్రూప్ ఎ, బి, సి పోస్టులు, అర్హతలివే!
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) వివిధ గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..