గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 10 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* ఇంజినీర్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 10


➥ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు


➥ ఇంజినీర్ (ఎస్&టీ): 06 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ పవర్ సప్లయ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ ‌ఇన్‌స్ట్రుమెంటేషన్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/ డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత.


పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.4లక్షలు చెల్లిస్తారు.


దరఖాస్తు చివరి తేది: 27.03.2023.


Notification


Website



Also Read


ఐసీఎస్‌ఐఎల్‌లో 583 ఉద్యోగాలు - అర్హతలు, పోస్టుల వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ఐసీఎస్‌ఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 586 మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. మీటర్ రీడ్ పోస్టులకు ఇంటర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు డిగ్రీ అర్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మార్చి 7 నుంచి 10 వరకు స్వల్పకాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 5369 సెలక్షన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 27లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...