ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(రిమ్స్) ప్రొఫెసర్ & ట్యూటర్,క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో),సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్), సీఏఎస్ ఆర్ఎంవో, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్(కన్సెర్న్డ్ స్పెషాలిటీ) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 147

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ ప్రొఫెసర్: 02

⏩ అసోసియేట్ ప్రొఫెసర్: 04

⏩ అసిస్టెంట్ ప్రొఫెసర్: 86

⏩ ట్యూటర్: 04

⏩ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్: 10

⏩ సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్): 07

⏩ సీఏఎస్ ఆర్ఎంవో: 02

⏩ సూపర్ స్పెషాలిటీ: 32

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్‌పీఎం, జనరల్ మెడిసిన్, టీబీ&సీడీ, డీవీఎల్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో-డయాగ్నసిస్,అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, రేడియాలజీ, అనస్థీషియాలజీ, కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ.

అర్హత: పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్(కన్సెర్న్డ్ స్పెషాలిటీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 64 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 

ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 02.08.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4గంటల వరకు.

Notification

Website

ALSO READ:

కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలుకేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల‌వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బ‌ట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial