ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల కొత్త షెడ్యూలును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబరు 6న విడుదల చేసింది. గతంలో పేర్కొన్నవ కాకుండా కొత్త పరీక్ష తేదీలను ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూలు ప్రకారం నవంబర్ 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 31న ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21, 23 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరు 2న మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. పరీక్షల తేదీలు మారుస్తు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు- దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 13న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.
పరీక్ష విధానం..
➥ ప్రాథమిక పరీక్ష (ఆబ్జెక్టివ్)లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (35 ప్రశ్నలు - 35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
➥ ప్రధాన పరీక్ష (ఆబ్జెక్టివ్)లో రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.
➥ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..