RBI Assistant Results: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన డిసెంబరు 31న నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను ఆర్‌బీఐ మార్చి 6న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను రీజియన్లవారీగా అందుబాటులో ఉంచింది.  ప్రాథమిక పరీక్ష (Prelimis) నవంబర్‌ 18, 19 తేదీల్లో; డిసెంబర్‌ 31న ప్రధాన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 జీతం ఉంటుంది. 


ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..


దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


అభ్యర్థులకు నవంబరు 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను డిసెంబరు 15న విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 31న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన స్కోరుకార్డును ఆర్‌బీఐ విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55700 జీతంగా ఇస్తారు.


పోస్టుల వివరాలు..


➥ అసిస్టెంట్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 450


శాఖల వారీగా ఖాళీలు..


➥ అహ్మదాబాద్: 13


➥ బెంగళూరు: 58


➥ భోపాల్: 12


➥ భువనేశ్వర్: 19


➥ చండీగఢ్: 21


➥ చెన్నై: 01


➥ గువాహటి: 26


➥ హైదరాబాద్: 14


➥ జైపుర్: 5


➥ జమ్మూ: 18


➥ కాన్పుర్ & లక్నో: 55


➥ కోల్‌కతా: 22


➥ ముంబయి: 101


➥ నాగ్‌పుర్: 19


➥ న్యూఢిల్లీ: 28


➥ పట్నా: 01


➥ తిరువనంతపురం & కొచ్చి: 16.


పరీక్ష విధానం..


* ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.


* ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రీజనింగ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.


* మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..