చెన్నైలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 'రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్' వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 140 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 19లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 140
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ సీనియర్ మేనేజర్: 10
➥ మేనేజర్: 10
➥ డిప్యూటీ మేనేజర్: 35
➥ అసిస్టెంట్ మేనేజర్: 35
➥ అడ్మిన్ అసిస్టెంట్: 50
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 28-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: ఏటా రూ.3.5 లక్షలు - రూ.8 లక్షలు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.07.2023.
ALSO READ:
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial