ఏపీ వైద్య విధాన పరిషత్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 27లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 57.
గైనకాలజిస్ట్: 01
అనస్థీటిస్ట్: 06
పీడియాట్రీషియన్: 01
ఫిజీషియన్: 04
జనరల్ సర్జన్: 01
కార్డియాలజిస్ట్: 01
మెడికల్ ఆఫీసర్: 16
స్టాఫ్ నర్స్: 20
ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 210. ఆప్టోమెట్రిషియన్: 01
సోషల్ వర్కర్: 01
ల్యాబ్ టెక్నీషియన్: 01
న్యూట్రిషన్ కౌన్సెలర్: 01
అటెండర్ కమ్ క్లీనర్: 01
అర్హతలు: పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో అందజేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.09.2023.
ALSO READ:
వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 1,339 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాకు ఎంపికయ్యారు. వీరి నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేయనున్నారు. అనంతరం సెప్టెంబరు 27 నుంచి టీఎస్‌పీఎస్సీ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.23,100- రూ.67,990 జీతం ఉంటుంది.
అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 3న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు, జోన్లవారీగా ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 434 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో భర్తీ చేస్తారు. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..