పార్వతీపురంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 23లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 24

➥ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూషనల్ కేర్): 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.27,804.

➥ లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి: 01 పోస్టు
అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.27,804.

➥ కౌన్సెలర్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ (సోషల్ వర్క్/సోషియాలజీ/సైకాలజీ/పబ్లిక్ హెల్త్/కౌన్సెలింగ్) లేదా పీజీ డిప్లొమా (కౌన్సెలింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ సోషల్‌ వర్కర్‌ (ఉమెన్): 01 పోస్టు
అర్హత: బీఏ (సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ అకౌంటెంట్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ (కామర్స్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.18,536.

➥ డేటా అనలిస్ట్‌: 01 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.18,536.

➥ ఔట్‌రీచ్ వర్కర్స్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.10,592.

➥ మేనేజర్/ కోఆర్డినేటర్ (ఉమెన్): 01 పోస్టు
అర్హత: పీజీ డిగ్రీ (సోషల్ వర్క్/సైకాలజీ)/ఎంఎస్సీ (చైల్డ్ డెవలప్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.23,170.

➥ సోషల్‌ వర్కల్‌ కం ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేటర్‌ (ఉమెన్): 01 పోస్టు
అర్హత: బీఏ (సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.18,536.

➥ నర్సు(ఉమెన్): 01 పోస్టు
అర్హత: MPHW/ ఏఎన్‌ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
జీతం: రూ.11,916.

➥ డాక్టర్ (పార్ట్ టైమ్): 01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్. పీడియాట్రిక్ మెడిసిన్ స్పెషలైజేషన్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
జీతం: రూ.9,930.

➥ ఆయా(ఉమెన్): 01 పోస్టు
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వివాదరహితులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. 
జీతం: రూ.7,944.

➥ చౌకీదార్(ఉమెన్): 01 పోస్టు
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వివాదరహితులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. 
జీతం: రూ.7,944.

➥ ఆఫీసర్-ఇన్ ఛార్జ్ (సూపరింటెండెంట్): 01 పోస్టు
అర్హత: పీజీ డిగ్రీ (సోషల్ వర్క్/సోషియాలజీ/ఛైల్డ్ డెవలప్‌మెంట్/హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/సైకాలజీ/సైకియాట్రీ/లా/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్).
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.33,100.

➥ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ (కామర్స్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉండాలి. 
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.18,536.

➥ పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ అర్హతతోపాటు డిప్లొమా (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.10,000.

➥ ఎడ్యుకేటర్‌ (పార్ట్ టైమ్): 01 పోస్టు
అర్హత: డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
జీతం: రూ.10,000.

➥ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్): 01 పోస్టు
అర్హత: డిగ్రీ/డిప్లొమా (ఆర్ట్స్&క్రాఫ్ట్స్) ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: రూ.10,000.

➥ కుక్‌: 02 పోస్టులు
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: కనీసం 50 మందికి వంట చేయగలగాలి.
జీతం: రూ.8,930.

➥ హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్: 02 పోస్టులు
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వివాదరహితులై ఉండాలి.
అనుభవం: కనీసం 50 మందికి వంట చేయగలగాలి.
జీతం: రూ.7,944.

➥ హౌస్ కీపర్: 01 పోస్టు
అర్హత: 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వివాదరహితులై ఉండాలి.
అనుభవం: కనీసం 10 సంవత్సరాలు.
జీతం: రూ.7,944.

వయోపరిమితి: 25-42 సంవత్సరాల మధ్య ఉండాలి.. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 23.11.2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
O/o. District Women & Child Welfare & Empowerment Officer,
Room No.3, 4, RCM Schools, 
Opposite to RTC Bus stand, 
Parvathipuram, 
Parvathipuram Manyam Dist. 

Notification

Application