Rashtriya Chemicals and Fertilizers Limited Notification: ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 158 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

వివరాలు..

* మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 158.

విభాగాలవారీగా ఖాళీలు..

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కెమికల్): 51 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్-21, ఎస్సీ-07, ఎస్టీ-04, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-05.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మెకానికల్‌): 30 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-13, ఎస్సీ-04, ఎస్టీ-02, ఓబీసీ-08, ఈడబ్ల్యూఎస్-03.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌): 27 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-11, ఎస్సీ-04, ఎస్టీ-03, ఓబీసీ-07, ఈడబ్ల్యూఎస్-02.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 18 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-07, ఎస్సీ-03, ఎస్టీ-01, ఓబీసీ-05, ఈడబ్ల్యూఎస్-02.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-01. 
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఫైర్): 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-02.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు నిండి ఉండాలి. 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సీసీ ల్యాబ్‌): 01 పోస్టు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ (కెమిస్ట్రీ) (లేదా) సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ (కెమిస్ట్రీ) అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01, ఓబీసీ-01. 
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌): 10 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-04, ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-03, ఈడబ్ల్యూఎస్-01. 
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఎంబీఏ/ఎంఎంఎస్ డిగ్రీ లేదా డిగ్రీ (సైన్స్/ఇంజినీరింగ్/అగ్రికల్చర్)తోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హ్యూమన్‌ రిసోర్సెస్-HR): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-01, ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-02. 
అర్హత: డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (బిజినెస్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్): 04 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-02, ఎస్సీ-01, ఓబీసీ-01. 
అర్హత: డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (బిజినెస్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

➥ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్): 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్-02, ఓబీసీ-01. 
అర్హత: డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (బిజినెస్ మేనేజ్‌మెంట్) లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.06.2024 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, దివాంగులకు కేటగిరీలవారీగా 37-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్‌), ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహటి, కోల్‌కతా, నేవీ ముంబయి/థాణే/ఎంఎంఆర్ రీజియన్, నాగ్‌పూర్‌. 

జీతభత్యాలు: ఉద్యోగాలకు ఎంపికైనవారికి శిక్షణ సమయంల నెలకు రూ.30,000 స్టైపెండ్‌గా ఇస్తారు. ఏడాది శిక్షణ పూర్తయిన తర్వాత ఈ1 గ్రేడ్ కింద రూ.40,000-1,40,000 పేస్కేలు వర్తింపజేస్తారు. అన్ని భత్యాలు కలిపి నెలకు రూ.81,000 వరకు చెల్లిస్తారు. అయితే ఉద్యోగంలో చేరే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బాండ్ అమౌంట్ కింద లక్షరూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏడాది శిక్షణతో కలిపి నాలుగేళ్లపాటు సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ బాంక్ నగదు డిపాజిట్ చేయని అభ్యర్థులకు వారికిచ్చే నెలవారి స్టైపెండ్ నుంచి కోతవిధిస్తారు.    

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.07.2024 (05:00 PM)

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపు తేదీలు: 08.06.2024  - 01.07.2024 (05:00 PM)

➥ దరఖాస్తుల సవరణకు చివరితేది: 01.07.2024 (05:00 PM)

➥ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 16.07.2024 (05:00 PM)

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...