Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏఎల్‌పీ/టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ & ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 790 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 790
➥ అసిస్టెంట్ లోకో పైలట్: 234
➥ టెక్నీషియన్-III/ఎలక్ట్రికల్ పవర్: 21
➥ టెక్నీషియన్-III/ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్: 19
➥ టెక్నీషియన్-III/ఆర్‌ఈఎఫ్‌ఎన్ & ఏసీ: 12
➥ టెక్నీషియన్-III/ఎలక్ట్రికల్/టీఆర్ఎస్: 96
➥ టెక్నీషియన్-III/ఎలక్/టీఆర్‌డీ: 39
➥ టెక్నీషియన్-III/సీ & డబ్ల్యూ: 74
➥ టెక్నీషియన్-III/డీఎస్‌ఎల్/మెషిన్: 02
➥ టెక్నీషియన్-III/డిజిల్/ఎలక్ట్రికల్: 03
➥ టెక్నీషియన్ Gr. I/సిగ్నల్: 25
➥ టెక్నీషియన్-III/సిగ్నల్: 18
➥ టెక్నీషియన్-III/టెలీ: 20
➥ టెక్నీషియన్-III/బ్లాక్ స్మిత్: 08
➥ టెక్నీషియన్-III/ వెల్డర్: 02
➥ టెక్నీషియన్-III/ట్రాక్ మిషన్: 12
➥ టెక్నీషియన్-III/రివెటర్: 02
➥ టెక్నీషియన్-III/కార్పెంటర్(వర్క్స్): 01
➥ టెక్నీషియన్-III/మాసన్(వర్క్స్): 04
➥ టెక్నీషియన్-III/బ్రిడ్జ్: 02
➥ టెక్నీషియన్-III/ప్లంబర్/పైప్ ఫిట్టర్: 01
➥ జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్/జీఎస్: 16
➥ జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్/టీఆర్ఎస్: 17
➥ జూనియర్ ఇంజినీర్/ఎలక్/టీఆర్‌డీ: 25
➥ జూనియర్ ఇంజినీర్/సీ & డబ్ల్యూ/మెషిన్: 23
➥ జూనియర్ ఇంజినీర్/డీఎస్‌ఎల్/మెషిన్: 02
➥ జూనియర్ ఇంజినీర్/డీఎస్‌ఎల్/ఎలక్ట్రికల్: 01
➥ జూనియర్ ఇంజినీర్/సిగ్నల్: 04
➥ జూనియర్ ఇంజినీర్/టెలి: 05
➥ జూనియర్ ఇంజినీర్/పి.వే: 23
➥ జూనియర్ ఇంజినీర్/వర్క్స్: 15
➥ జూనియర్ ఇంజినీర్/బ్రిడ్జిలు: 02
➥ జూనియర్ ఇంజినీర్/ట్రాక్ మెషిన్: 35
➥ గార్డ్/ట్రైన్ మేనేజర్: 27
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 42 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.08.2023
ALSO READ:
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..