న్యూఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1200 చెల్లించాలి. అయితే వఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 


వివరాలు..


* ఖాళీల సంఖ్య: 81


➥ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): 26 పోస్టులు


అర్హత: డిప్లొమా (ఎలక్ట్రానిక్స్)/ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


అనుభవం: టెలికామ్ రంగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: రూ.30,000-రూ.1,20,000.


➥ డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): 27 పోస్టులు


అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్-ఎలక్ట్రానిక్స్, టెలికామ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ) లేదా ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


అనుభవం: టెలికామ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: రూ.40,000-రూ.1,40,000.


➥ డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 15 పోస్టులు


అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్).


అనుభవం: టెలికామ్ రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: రూ.40,000-రూ.1,40,000.


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్):  06 పోస్టులు


అర్హత: ఎంబీఏ (ఫైనాన్స్).


అనుభవం: అనుభవం అవసరం లేదు.


వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: రూ.30,000-రూ.1,20,000.


➥ అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్‌): 07 పోస్టులు


అర్హత: ఎంబీఏ (హెచ్‌ఆర్‌).


అనుభవం: అనుభవం అవసరం లేదు.


వయోపరిమితి: 11.11.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: రూ.30,000-రూ.1,20,000.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. మొత్తం 200 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 150 మార్కులు రాతపరీక్షకు, 50 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు.


రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 100 మార్కులు, జనరల్ నాలెడ్జ్-న్యూమరికిల్ ఎబిలిటీ-రీజనింగ్-ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.2023. (23:59 Hrs)


Notification


Online Application


Website


ALSO READ:


రాష్ట్రీయ కెమికల్స్‌ & ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..