న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్ బ్యాంక్‌ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 183 ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 28 నుంచి జులై 12 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు...


* స్పెషలిస్ట్ ఆఫీసర్స్


ఖాళీల సంఖ్య: 183


విభాగాల వారీగా ఖాళీలు.. 


➥ ఐటీ ఆఫీసర్‌  (జీఎంజీఎస్-1): 24 పోస్టులు


➥ రాజ్‌భాషా ఆఫీసర్  (జీఎంజీఎస్-1): 02 పోస్టులు


➥ సాఫ్ట్‌వేర్‌డెవలపర్‌  (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ లా మేనేజర్‌  (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ ఛార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ సెక్యూరిటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ డిజిటల్ మేనేజర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ ఫోరెక్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ మార్కెటింగ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌  (ఎంఎంజీఎస్-2): 02 పోస్టులు


➥ టెక్నికల్‌ ఆఫీసర్‌-సివిల్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ ఛార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ డిజిటల్ మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ రిస్క్ మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ ఫోరెక్స్ డీలర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ ట్రెజరీ డీలర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥ లా మేనేజర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥  ఫోరెక్స్‌ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


➥  ఎకనమిస్ట్‌ ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్-3): 02 పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 31.03.2023 నాటికి 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత వర్గాలకు చెందినవారికి 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌ లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: నెలకు రూ.36000-రూ.78230 చెల్లిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.06.2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.07.2023.


Notification


Online Application


Website


ALSO READ:


చండీగఢ్‌ పీజీఐఎంఈఆర్‌లో 206 గ్రూప్ ఎ, బి, సి పోస్టులు, అర్హతలివే!
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) వివిధ గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి ఐటీఐ, డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial