భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 240 ఖాళీలను భర్తీచేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.

వివరాలు...

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 240

విభాగాలవారీగా ఖాళీలు..

➥ ఆఫీసర్‌-క్రెడిట్: 200

➥ ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08

➥ ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్: 05

➥ ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04

➥ ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్: 01

➥ ఆఫీసర్-ఎకనామిక్స్: 06

➥ మేనేజర్-ఎకనామిక్స్: 04

➥ మేనేజర్-డేటా సైంటిస్ట్: 03

➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02

➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04

➥ సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03

అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి డిగ్రీ/బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: కనీసం 21-38 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.06.2023.

➥ ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 02.07.2023

Website

Also Read:

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 300 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు!ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్(కాంట్రాక్ట్) ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.  నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..