భారత ప్రభుత్వ సమాచార, మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసార భారతి (Prasar Bharati) సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్, సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు రేపటి (అక్టోబర్ 18) లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టులు 2, సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టులు 4ను (మొత్తం 6 పోస్టులు) భర్తీ చేయనుంది. ఆసక్తి గల వారు 'DDO, DD News, New Delhi' పేరుతో రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి.
సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టుల వివరాలు..
ఈ పోస్టుల గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లుగా ఉంది. 2021 అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్ల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు సంబంధిత రంగంలో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ.41,000గా ఉంది. సంస్కృత బులెటిన్ కాపీ ఎడిటర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఐఐటీ కాన్పూర్‌లో 95 జాబ్స్.. రూ.2.09 లక్షల వరకు జీతం.. 51 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..
సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల వివరాలు..
2021 అక్టోబర్ 1 నాటికి 40 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటేషన్‌లో లెవల్-సి/డిప్లొమాలో ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో (Rehabilitation Council of India) రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో ఒక సంవత్సరం పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ.48,000గా ఉంది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రసార భారతి పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. ప్రసార భారతి అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
2. ఇందులో కెరీర్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకునే పోస్టును ఎంచుకోండి.
3. దరఖాస్తు చేసుకునే ముందు జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవాలి.
4. తమ వివరాలు నమోదు చేసుకున్నాక కింద పేర్కొన్న చిరునామాకు దరఖాస్తులను పంపాలి.
Deputy Director (HR),
Doordarshan News,
Room No. 413, 4th Floor, Doordafshan Bhawan,
Tower-B, Copernicus Marg,
New Delhi-1 10001
5. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫాంను భద్రపరుచుకోండి.
Also Read: డీఆర్డీఓ హైదరాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Also Read: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి