Group2 Grand Test: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై నెలలో ప్రతివారంలో రెండు రోజులు గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో మొదటి గ్రాండ్ టెస్ట్; జులై 15, 16 తేదీల్లో రెండో గ్రాండ్ టెస్ట్; జులై 22, 23 తేదీల్లో మూడో గ్రాండ్ టెస్ట్; జులై 30, 31 తేదీల్లో నాలుగో గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group2 Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు (Group2 Applications) దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2024, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 600 మార్కులకు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో (సీబీటీ) నిర్వహించే పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు.
➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు.
➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు.
➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు.
* గ్రూప్-2 పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 783
- మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
- అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
- నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
- సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
- అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
- అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
- మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
- అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
- డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
- అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
- అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
గ్రూప్-2 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
రైల్వే ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టుల సంఖ్య, ఏకంగా మూడింతలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో 5,696 అసిస్టెంట్ లోకోపైలట్(Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి నెలలో రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఖాళీల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడింతలు పెంచడంతో పోస్టుల సంఖ్య 18,799 కి చేరింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..