YSRCP News :   బీజేపీలో చేరేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాకు చెప్పారు. ఇప్పటికే మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని ప్రకటించారు.   వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని స్వయంగా మిధున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు.  బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నాని అయినప్పటికీ తాము చేరుతామని    మిథున్  రెడ్డి ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. 


తండ్రిని కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్న మిథున్ రెడ్డి                


తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిధున్ ఒత్తిడి తెస్తున్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.  మద్యం, ఇసుక మాఫియాల  మీదే కాకుండా చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందని ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయని.. జగన్‌ పై చర్యలు తీసుకోవాలని  ఆదినారాయణ రెడ్డి కోరుతున్నారు. 


పెద్దిరెడ్డి  కక్ష సాధింపులపై టీడీపీ తీవ్ర ఆగ్రహం                                       


వైసీపీ గెలిచిది నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే. అందులో రాజంపేట , తిరుపతి , అరకు,  కడప స్థానాలు ఉన్నాయి. రాజంపేట, తిరుపతి స్థానాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలంతో గెలిపించుకున్నారు. పెద్దిరెడ్డి కుటుబంం నుంచి పోటీ చేసిన ముగ్గురూ విజయం సాధించారు. కానీ పెద్దిరెడ్డి టీడీపీని టార్గెట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుపై రాళ్ల దాడి వెనకు ఆయన ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కుప్పంలో  చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను  ఓడించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఆయనకు మైనింగ్, మిల్క్, కాంట్రాక్ట్‌లు వంటి బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ చేస్తే తాము ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు. బీజేపీలో ఉంటే సేఫ్ గా ఉంటామన్న ఉద్దేశంతో ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై స్పందించని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి  


ఆదినారాయణ రెడ్డి వారం రోజుల కిందట కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే అప్పుడు ఎవరూ ఖండించలేదు. మిథన్ రెడ్డి కూడా ఖండించలేదు. దీంతో మరోసారి ఆదినారాయణరెడ్డి అవే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. గతంలో వైసీపీ పాలన అంతా కక్ష సాధింపుల మయం కావడంతో.. తమపైనా అలాగే ప్రవర్తిస్తే ఇబ్బందులు పడతామన్న ఉద్దేశంతో .. వైసీపీ నేతలు సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.