Power Grid Corporation of India Limited Recruitment: గురుగ్రామ్‌లోని మహారత్న కంపెనీ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70  పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి  ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.24,000 జీతంగా చెల్లిస్తారు. పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అడ్మిట్‌కార్డుతోపాటు తప్పనిసరిగా ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్షకు అనుమితించరు.


వివరాలు..


➥ ట్రైనీ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) పోస్టులు


ఖాళీల సంఖ్య: 70 పోస్టులు.


పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-30, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-05. మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకు 3 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 పోస్టులు కేటాయించారు.


అర్హత: టెక్నికల్ బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిప్లొమాతో బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ కలిగి ఉండాలి. డిప్లొమాలో   జనరల్, ఓబీసీ(ఎన్‌సీఎల్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 70 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ అయితే చాలు.


వయోపరిమితి: 06.11.2024 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: రాత పరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.


రాతపరీక్ష విధానం: మొత్తం 170 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 170 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-1లో 120 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, పార్ట్-2లో 50 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 


అర్హత మార్కులు: రాతపరీక్షలో అర్హత మార్కులకు రెండు విభాగాలకు కలిపి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. అయితే ఒక్కో విభాగంలో కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 30 శాతంగా నిర్ణయించారు. అయితే ఒక్కో విభాగంలో కనీసం 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


రాతపరీక్ష కేంద్రాలు: నాగ్‌పుర్, భోపాల్‌, బెంగళూరు, చెన్నై.


జీతం: నెలకు రూ.24,000.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.10.2024. 


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 06.11.2024.


➥ రాతపరీక్ష అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీ: తర్వాత ప్రకటిస్తారు.


➥ రాతపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.


Notification 


Online Application


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..