హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


➥ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ 


➥ డీన్ ఆఫ్ స్టైడెంట్ అఫైర్స్ 


➥ డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ 


➥ డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ 


➥ డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ 


➥ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ 


➥ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ 


➥ యూనివర్సిటీ లైబ్రేరియన్ 


అర్హతలు..


➦ డీన్, డైరెక్టర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ అర్హత ఉండాలి. కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉండాలి.


➦ లైబ్రేరియన్ పోస్టులకు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (లైబ్రేరి సైన్స్‌/ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్ సైన్స్), పీహెచ్‌డీ డిగ్రీ(లైబ్రేరి సైన్స్‌/ఇన్‌ఫర్మేషన్ సైన్స్/డాక్యుమెంటేషన్/ఆర్కైవ్స్ & మనుస్క్రిప్ట్ కీపింగ్) అర్హతతోపాటు లైబ్రేరియన్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.


గరిష్ట వయసు: 60 సంవత్సరాలు.   


దరఖాస్తు ఫీజు: రూ.5000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500 చెల్లించాలి. 'COMPTROLLER, PJTSAU' పేరిట హైదరాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, రూ.


జీతం: రూ.1,44,200 - రూ.2,18,200.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Joint Registrar,
Professor Jayashankar Telangana State Agricultural University, 
Administrative Office,
Rajendranagar, Hyderabad – 500030.   


దరఖాస్తుకు చివరితేది: 06.11.2023. (4 PM).


Notification & Application


Website


ALSO READ:


వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో 140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..