మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒప్పంద ప్రాతిపదికన టెన్యూర్ బేస్డ్ డేంజర్ బిల్డింగ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఓసీపీ ట్రేడులో ఎస్‌సీటీవీటీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

* డేంజర్ బిల్డింగ్ వర్కర్

మొత్తం ఖాళీలు: 200

అర్హత: ఏఓసీపీ ట్రేడులో ఎస్‌సీటీవీటీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: నిబంధనల మేరకు.

బేసిక్ పే: రూ.19,900, డీఏ.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.

చిరునామా: The General Manager,                    Ordnance Factory Khamaria                    District: Jabalpur                    Madhya Pradesh, Pin -482005

Notification 

Website

Also Read:

నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. Join Us on Telegram: https://t.me/abpdesamofficial