Adipurush: దర్శకుడు ఓమ్ రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా గురించి స్పందన ఎలా ఉన్నా అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కిన ఈ రామాయణ గాథను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది యువత, విద్యార్థులు కూడా మూవీను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా టికెట్లు అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాలకు ఉచితంగా అందించారు. పలువురు సెలబ్రెటీలు కూడా కొన్ని వేల ఉచిత టికెట్లను అందించారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ కూడా ఓ వినూత్న ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా కొన్ని వందల మంది అనాథ పిల్లలకు ‘ఆదిపురుష్’ సినిమాను ఉచితంగా చూపించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా కలెక్టర్ చేసిన పనిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. 


ఉచితంగా ‘ఆదిపురుష్’ సినిమా..


‘ఆదిపురుష్’ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలి అనే ఉద్దేశంతో దాదాపు 10 వేల టికెట్లను అనాధ పిల్లలు, వృద్దులకు మూవీ టీమ్ పదివేల టికెట్లును ఉచితంగా ఇచ్చింది. మూవీ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ రణబీర్ కపూర్, రామ్ చరణ్ ఇలా పలువురు సెలబ్రెటీలు ఉచిత టికెట్లను అందజేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఎంతో మంది అనాధ పిల్లలు ఉంటారు. వారందరికీ సినిమా చూసే అవకాశం దక్కుతుందా అంటే ప్రశ్నార్థకమనే చెప్పాలి. అందుకే తన వంతు ప్రయత్నంగా ఏదొకటి చేయాలి అని అనుకున్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్. నరసారావుపేటలో అనాధ పిల్లలు అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్న స్టూడెంట్ లకు ‘ఆదిపురుష్’ సినిమాను ఉచితంగా చూపించే ప్రయత్నం చేశారు. 


విద్యార్థులతో కలిసి సినిమా చూసిన కలెక్టర్..


రామాయణం లాంటి ఇతిహాసాలను నేటి తరానికి తెలిసేలా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్. దాదాపు 500 మంది అనాధ పిల్లలు, ప్రభుత్వ సంక్షేమ గృహాల విద్యార్థులకు ఉచితంగా ‘ఆదిపురుష్’ సినిమాను చూపించారు. అందుకోసం దగ్గరలో ఉన్న ఓ థియేటర్ ఓనర్లతో మాట్లాడి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పిల్లలందరికీ ‘ఆదిపురుష్’ సినిమాను చూపించారు. ఆయన కూడా పిల్లల మధ్యలో కూర్చొని సినిమాను చూశారు. సినిమా ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడారు. పిల్లలతో కూర్చొని ఇలా సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు కలెక్టర్. ఎప్పుడూ థియేటర్ కు రాని పిల్లలు త్రీడీ లో ఈ సినిమా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారని చెప్పారు. ఇలాంటి సినిమాలు వచ్చినపుడు అనాధ పిల్లలకు థియేటర్లలో కొన్ని సీట్లు కేటాయిస్తే ఎంతో మంది చూడగలుగుతారని అన్నారు. ఇలా చేయడం వలన రాబోయే తరాల్లో ఒక ఆలోచన రేకెత్తించడానికి దోహదపడతుందని అభిప్రాయ పడ్డారు. 


Also Read: మంగళవారం రోజు పాప పుట్టడం సంతోషం - జాతకం కూడా చాలా బాగుందంటున్నారు: చిరంజీవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial