NPCIL Recruitment 2024: ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


వివరాలు..


* అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు


ఖాళీల సంఖ్య: 58


విభాగాల వారీగా ఖాళీలు..


1) అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్‌ఆర్‌): 29 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-13, ఈడబ్ల్యూఎస్-02, ఎస్సీ-02, ఎస్టీ-03, ఓబీసీ-09. 


2) అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్‌&ఎ): 17 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-08, ఈడబ్ల్యూఎస్-01, ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ-05. 


3) అసిస్టెంట్ గ్రేడ్-1 (సి&ఎంఎం): 12 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-05, ఈడబ్ల్యూఎస్-01, ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-04. 


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 25.06.2024 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు(జనరల్/ఈడబ్ల్యూఎస్- 10 సంవత్సరాలు,  ఓబీసీ- 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ- 15 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


పరీక్ష విధానం: రాత పరీక్ష స్టేజ్- 1, స్టేజ్- 2 రెండు దశల్లో ఉంటుంది. 


ప్రిలిమనరీ పరీక్ష (స్టేజ్- 1) విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలోో మొత్తం 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయించారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఎఫైర్స్- 25 ప్రశ్నలు- 75 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్- 15 ప్రశ్నలు-45 మార్కులు, ఇంగ్లిష్- 10 ప్రశ్నలు-30 మార్కులు. పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 


అడ్వాన్స్‌డ్ టెస్ట్ (స్టేజ్- 2) విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు 3 మార్కులు కేటాయించారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు- 75 మార్కులు, క్రిటికల్ రిజనింగ్- 25 ప్రశ్నలు- 75 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 


పే స్కేల్: నెలకు రూ.38,250.


ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 25.06.2024.


Notification


Website


ALSO READ:


➥ రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు


దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో 176 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...