NPCL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌భట రాజస్థాన్ సైట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.7,700 - రూ.8,855 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 335 ఖాళీలు.


పోస్టుల కేటాయింపు: ఎస్సీ- 56, ఎస్టీ- 43, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)- 67, ఈడబ్ల్యూఎస్‌- 33, యూఆర్‌(జనరల్)- 136.


శిక్షణ కాలం: ఏడాది.


ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్.


అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


స్టైపెండ్: నెలకు రూ.7,700 - రూ.8,855.


‌ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరితేది: 04.04.2024.


Notification


Online Application


Website


➥ సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులు
బిలాస్‌పూర్ డివిజన్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 733 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత, సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. టెన్త్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 733


* యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులు


ట్రెడ్‌‌ల వారీగా ఖాళీలు..


➥ కార్పెంటర్‌: 38 పోస్టులు 


➥ సీఓపీఏ: 100 పోస్టులు 


➥ డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌): 10 పోస్టులు  


➥ ఎలక్ట్రిషియన్‌: 137 పోస్టులు 


➥ ఎలక్ట్రికల్‌(మెకానికల్‌): 05  పోస్టులు  


➥ ఫిట్టర్‌: 187  పోస్టులు 


➥ మెషినిస్ట్‌: 04  పోస్టులు  


➥ పెయింటర్: 42  పోస్టులు 


➥ ప్లంబర్‌: 25  పోస్టులు  


➥ మెకానికల్‌(ఆర్‌ఏసీ): 15 పోస్టులు  


➥ ఎస్‌ఎండబ్ల్యూ: 04  పోస్టులు  


➥ స్టెనో(ఇంగ్లిష్): 27  పోస్టులు 


➥ స్టెనో(హిందీ): 19  పోస్టులు  


➥ డిజిల్‌ మెకానిక్‌: 12 పోస్టులు  


➥ టర్నర్‌:  04 పోస్టులు  


➥ వెల్డర్‌:  18 పోస్టులు 


➥ వైర్‌మెన్‌: 80 పోస్టులు  


➥ కెమికల్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: 04 పోస్టులు  


➥ డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌: 02 పోస్టులు 


అర్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రెడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 12.04.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: టెన్త్‌, ఇంటర్‌ మార్కుల మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2024.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...