హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023-24 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్(కమర్షియల్ ప్రాక్టీస్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 13 నుంచి జూన్ 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, డిప్లొమా స్థాయులో అభ్యర్థుల సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 70
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 17
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 30
3. డిప్లొమా అప్రెంటిస్: 23
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, డిప్లొమా ఇంజినీరింగ్(కమర్షియల్ ప్రాక్టీస్) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: డిగ్రీ, డిప్లొమా స్థాయులో అభ్యర్థుల సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టైపెడ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.05.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.06.2023.
Also Read:
ఏఈఈ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మే 17 నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ అందుబాటుల ఉంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ హైకోర్టులో 84 కాపియిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.69 వేల వరకు జీతం!
తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న కాపీస్ట్ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..