పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో 53 ఆశా వర్కర్ పోస్టులను భర్తీచేయనున్నారు. కనీసం 8వ తరగతి లేదా పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు సంబంధిత గ్రామానికి చెందినవారై ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 



వివరాలు..

* ఆశా వ‌ర్కర్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 53 

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. కనీసం 8వ తరగతి చదివి ఉండాలి. ఖాళీలు ఉన్న గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, కలుపుగోలుతనం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు జతచేసి సంబంధిత పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: జిల్లా సెల‌క్షన్ క‌మిటీ ద్వారా ఎంపిక చేస్తారు. 


దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన డాక్యుమెంట్లు..


➥ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి/ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్


➥ విలేజ్ హ గ్రామ ఆరోగ్య, పారిశుధ్య-పోషకాహార కమిటీ (VHSNC) నుంచి ధ్రువీకరణ కాపీని జతచేయాలి


➥ ఎమ్మార్వో జారీచేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే), లేని పక్షంలో వారికి ఓసీలుగా పరిగణిస్తారు.


➥ వివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు పొందిన మహిళలు/ఒంటరి మహిళలు సంబంధిత సర్టిఫికేట్ జతచేయాల్సి ఉంటుంది.


➥ రెసిడెన్స్ సర్టిఫికేట్


➥ ఆధార్ కార్డు


➥ రేషన్ కార్డు


➥ దివ్యాంగులైతే మెడిక్ బోర్డు జారీచేసిన డిజెబిలిటీ సర్టిఫికేట్ జతచేయాలి.


ముఖ్యమైన తేదీలు...


➥ సంబంధిత పీహెచ్‌సీల్లో దరఖాస్తుల స్వీకరణ చివరితేది: 10.11.2023.


➥ పీహెచ్‌సీల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడి: 15.11.2023.


➥ పీహెచ్‌సీల్లో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ తేదీలు: 16, 17.11.2023.


➥ పీహెచ్‌సీల్లో తుది మెరిట్ జాబితా, ఎంపిక జాబితా వెల్లడి: 19.11.2023.


➥ సెలక్షన్ కమిటీ ద్వారా నియామక ఉత్తర్వుల జారీ: 20.11.2023.


Notification & Application


Website


ALSO READ:


ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు పరిధిలో... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...