ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..
* ప్రాసెస్ సర్వర్ పోస్టులు: 439
జిల్లాల వారీగా ఖాళీలు..
అనంతపురం: 30
చిత్తూరు: 42
తూర్పు గోదావరి: 26
గుంటూరు: 72
వైఎస్ఆర్ కడప: 25
కృష్ణా: 50
కర్నూలు: 23
నెల్లూరు: 22
ప్రకాశం: 27
శ్రీకాకుళం: 49
విశాఖపట్నం: 40
విజయనగరం: 22
పశ్చిమగోదావరి: 11
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జీతం: రూ.23,120 - రూ.74,770.
రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోప్రశ్నలకు ఒకమార్కు ఉంటుంది. వీటిలో జనరల్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-40 ప్రశ్నలు-40 మార్కులు. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:11.11.2012.
:: ఇవీ చదవండి ::
AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీ హైకోర్టులో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా హైకోర్టులోని వివిధ విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్/కోర్టు ఆఫీసర్/స్క్రూటినీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఐదేళ్ల లా డిగ్రీ లేదా డిగ్రీతోపాటు మూడేళ్ల లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP High Court Jobs: హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు, టైప్ రైటింగ్, పీజీ డిప్లొమా(కంప్యూటర్) లేదా బీసీఏ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP High Court Jobs: హైకోర్టులో ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ హైకోర్టులో ఓవర్‌సీర్ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి ఐదేళ్ల లా డిగ్రీ లేదా డిగ్రీతోపాటు మూడేళ్ల లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..